- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఘోర విషాదం చోటుచేసుకుంది. నేరేడు చెరువులో వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్లిన శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. సరదాగా సాగాల్సిన నిమజ్జనం క్షణాల్లో విషాదాంతంగా మారడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘటన పై సమాచారం అందుకున్న వెంటనే పటాన్‌చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పటాన్‌చెరులోని ప్రాచీన ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -


