- కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్నరాజు
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : విద్యాభివృద్ధి తోపాటు విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ అమలు చేస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్నరాజు అన్నారు.బుధవారం హుస్నాబాద్ మండలంలో ని పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెన్నరాజు మాట్లాడుతూ కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు రూ.8 కోట్ల వ్యయంతో రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారని తెలిపారు.
కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం అందుతుందని చెప్పారు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా సంస్థ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో 16,544 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.హుస్నాబాద్ మండలంలో 30 పాఠశాలలు, 2 జూనియర్ కళాశాలల్లో 2,941 మంది, కోహెడ మండలంలో 47 పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో 3,344 మంది, అక్కన్నపేట మండలంలో 50 పాఠశాలల్లో 2,280 మంది, భీమదేవరపల్లి మండలంలో 39 పాఠశాలల్లో 2,526 మంది, ఎల్కతుర్తి మండలంలో 35 పాఠశాలల్లో 1,487 మంది, చిగురుమామిడి మండలంలో 32 పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో 2,078 మంది, సైదాపూర్ మండలంలో 43 పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో 1,888 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారని వివరించారు.విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి సరైన పోషకాహారం ఎంతో అవసరమని, అల్పాహారం అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడటంతో పాటు అలసట తగ్గి చదువుపై దృష్టి పెట్టేందుకు దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉదయం అల్పాహారం సిద్ధం చేసే భారం తగ్గడంతో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని రాజ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొంగోని శ్రీనివాస్, పోతగంటి బాలయ్య, భూక్య తిరుపతి నాయక్, సింగిల్ డైరెక్టర్, గ్రామ శాఖ అధ్యక్షులు ఎగ్గొజ్ ఈశ్వర్, గుగులోతు రవి నాయక్, మండల నాయకులు బోయిని రాజశేఖర్, మెడబోయిన ఆంజనేయులు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



