Thursday, September 17, 2026
E-PAPER
Homeజాతీయంబంగారం కొనేవారికి షాక్..

బంగారం కొనేవారికి షాక్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌ ఛార్జీలను బీఐఎస్‌ 67 శాతం పెంచింది. సెప్టెంబర్‌ 14 నుంచి ఒక్కో బంగారు నగపై ఛార్జీ రూ.45 నుంచి రూ.75కు పెరిగింది. దీంతో ఒక్కో ఆభరణంపై రూ.30 అదనపు భారం పడనుంది. ఈ వ్యయాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. అయితే వెండి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ ఛార్జీలో ఎలాంటి మార్పు చేయలేదు. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపి పెంపును సమీక్షించాలని జీజేసీ కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -