Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం..

మండలంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి : నిజా పాలనకు ముగింపునకు సూచనగా సెప్టంబర్ 17ను రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలిస్తున్నాడు.భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చిన తర్వాత హైదారాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో కలిపేందుకు నిజాం పాలకుడు అంగీకరించకపోవడంతో దేశ రక్షణ దళాలు సంస్థానాన్ని చుట్టుముట్టాయి. తదనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా హైదారాబాద్ భారత దేశంలో విలీనమైంది.సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన,బీఆర్ఎస్ జాతీయ సమైక్యత,బీజేపీ విమోచన, సీపీఐ, సీపీఐ(ఎం) విలీన దినోత్సవంగా జరుపుతున్నారు. గురువారం మండలంలో ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహాసీల్, ప్రజా పరిషత్, వ్యవసాయ, ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో తహసీల్దార్ శ్రీకాంత్, ప్రవీన్, ఏఓ సంతోశ్, డాక్టర్ మాధురి, ఠాణాలో ఎస్ఐ తిరుపతి, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు.అయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధ్వర్యంలో..
మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యత దినోత్సవౌ ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్,బీఆర్ఎస్ శ్రేణులు హజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -