Thursday, September 17, 2026
E-PAPER
Homeజాతీయందీక్ష విరమించిన మ‌నోజ్ జరాంగే

దీక్ష విరమించిన మ‌నోజ్ జరాంగే

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మ‌రాఠా రిజ‌ర్వేష‌న్ కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన ఉద్య‌మ‌కారుడు మ‌నోజ్ జరాంగే త‌న దీక్ష విర‌మించాడు. 20 రోజులుగా సాగించిన దీక్ష‌ను సెప్టెంబ‌ర్ 17, గురువారం విర‌మించాడు. మ‌రాఠా రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ప్ర‌భుత్వానికి మూడు నెల‌ల గ‌డువు విధించాడు. ఆలోపు ప్ర‌భుత్వం అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోకుంటే ఉద్య‌మాన్ని ముంబై న‌గ‌రానికి తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించాడు. మ‌హారాష్ట్ర‌లో మ‌రాఠీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే డిమాండ్‌తో మ‌నోజ్ జ‌రాంగే కొంత‌కాలంగా ఉద్య‌మం చేస్తున్నాడు.

ఇటీవ‌ల త‌న డిమాండ్ నెర‌వేర్చాల‌ని కోరుతూ నిరాహార దీక్ష‌కు దిగాడు. అలాగే, హైద‌రాబాద్ గెజిట్, స‌తారా గెజిట్, ఔంద్ గెజిట్ స‌హా ప‌లు ప్ర‌భుత్వ రికార్డుల ప్ర‌కారం కున్బి వంశ‌స్థుల‌ను ఓబీసీలుగా గుర్తించాల‌ని, వారికి ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్స్ క‌ల్పించాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -