- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు టాటా సన్స్ బోర్డు ఆమోదం తెలిపింది. గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో తాను ఈ పదవిలో రెండోసారి కొనసాగడానికి ఇష్టపడట్లేదని ప్రకటించిన చంద్రశేఖరన్.. బోర్డు అభ్యర్థన మేరకు తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆయన ప్రస్తుత పదవీ కాలం ఫిబ్రవరి 2027తో ముగియనుండగా.. తాజా ఆమోదంతో మరో 5 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
- Advertisement -



