నవతెలంగాణ-మిడ్జిల్
గిరిజన తండాలను పంచాయతీలుగా ప్రకటించి గిరిజనులకే రాజ్యాధికారం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ పవర్ చెప్పారు. మాజీ మంత్రివర్యులు డా. లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు, మిడ్జిల్ మండల ST సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ పవార్ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని వివిధ తండాలలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి గిరిజన యువకులు, మహిళలు, పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ పవార్ మాట్లాడుతూ..గిరిజన రిజర్వేషన్లను 6% నుండి 10% కి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి సుమారు 30 వేల మంది గిరిజనులను ప్రజాప్రతినిధులుగా గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభలో 12% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ సర్కార్ తండాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవి గ్రామ అధ్యక్షుడు రవి నాయక్,నాయకులు శంకర్, శాంతి కేళి, చంద్రు, బాల్య, నాయకులు గిరిజన మహిళలు, యువకులు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


