Friday, September 18, 2026
E-PAPER
Homeజాతీయంచమురు కంపెనీలకు ఎగుమతి పన్ను తగ్గింపు

చమురు కంపెనీలకు ఎగుమతి పన్ను తగ్గింపు

- Advertisement -

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ మరియు ఏవియేషన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)లపై ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి తగ్గించింది. కొత్త రేట్లు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు చమురు కంపెనీలు ఆర్జించే అదనపు లాభాలలో కొంత భాగాన్ని రాబట్టుకోవడానికి ప్రవేశపెట్టిన విండ్‌ఫాల్ పన్నును ఇప్పుడు మళ్లీ తగ్గించారు. సవరించిన రేట్ల ప్రకారం, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ.25 నుంచి రూ.20కి తగ్గించారు. అదేవిధంగా, పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.1.5 నుంచి రూ.0.5కు తగ్గించారు. జెట్ ఫ్యూయల్‌పై సుంకాన్ని కూడా లీటరుకు రూ.19 నుంచి రూ.15కు తగ్గించారు. దేశీయ మార్కెట్లో ఇంధన ధరను తగ్గించకుండానే చమురు కంపెనీలు అదనపు లాభాలు ఆర్జించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరను బట్టి ప్రతి పక్షం రోజులకు పన్నులు మారుస్తుంటారు. భారతదేశ మొత్తం ఇంధన ఎగుమతులలో 85 శాతానికి పైగా ప్రైవేట్ రంగ కార్పొరేట్ కంపెనీల ద్వారానే జరుగుతున్నాయి. కేంద్రం మరోసారి పెద్ద కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇస్తూ, ఇంధన ధరల భారాన్ని కోట్లాది సామాన్య ప్రజలపై మోపుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -