Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నషక్కర్గాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

చిన్నషక్కర్గాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని చిన్నషక్కర్గాలో కాంగ్రెస్‌ మండలాధ్యక్ష‍ులు ధరాస్‌ సాయిలు, తహశీల్దార్‌ ఎండీ ముజీబ్‌ సంయుక్తంగా లభ్దిదారులకు శుక్రవారం స్మార్ట్‌రేషన్‌ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్ష‍ేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజాపాలన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్ష‍ేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఆ గ్రామ ఉపసర్పంచ్ షేక్ మహబూబ్, ఆ గ్రామ కార్యదర్శి ప్రణయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాం పటేల్, మద్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి గోపి, నాయకులు గంగాధర్, ఆ గ్రామ నాయకులు, కార్యకర్తలు, రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -