ఆలేరులో పోలీస్ ఫ్లాగ్ మార్చ్
నవతెలంగాణ-ఆలేరు టౌను
శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరపాలని, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆలేరు పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రులు పురస్కరించుకొని ఎలాంటి ఆ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఆలేర్ పట్టణంలో 45, మండపాలలో, మండలంలో మొత్తం 150 వినాయక విగ్రహాలు ప్రతిష్టించినట్టు ఆయన వివరించారు.
వినాయక నిమజ్జనానికి సంబంధించి మండలంలోని గోధుమ కుంట, రాఘవపురం, సాయి గూడెం చెరువులను పరిశీలించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సిఐ వివరించారు. పోలీస్ ఫ్లాగ్ మార్చ్ లో ఆలేరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉదయ్ కిరణ్, ఎస్సై వినయ్ స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.



