– కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్
– పాల్గొన్న 3 వేల మంది భక్తులు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నదానాన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు హాజరైన దయానంద్ విజయకుమార్ కు ఉత్సవ కమిటీ బాధ్యులు ఘనంగా స్వాగతం పలికి, గణనాధుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దయానంద్ విజయకుమార్‌కు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 3000 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులు వందనపు సత్యనారాయణ (గ్యాస్), కౌన్సిలర్ హకీం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, మొహమ్మద్ కమల్ పాషా, పద్మ, కాజా కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.



