వర్షాలపైనే రైతుల ఆశలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పత్తి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.4,500 ఉంది. నుంచి 4వేల ధర పలుకుతుంది.ఈ లెక్కన ఓపెన్ మార్కెట్లో క్వింటాలు పత్తి ధర రూ.9వేలుగా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.మండలంలో ఆశించిన పూత లేని పత్తి చేను పత్తి ధర ఆశాజనకంగా ఉన్నా ప్రస్తుతం మార్కెట్లో రేటు మురిపిస్తోంది.మండలంలో 3600 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
వర్షాలపైనే రైతుల ఆశలు..
పత్తి దిగుబడిపై రైతుల్లో అనిశ్చితి కనిపిస్తుంది.ఎల్నివో కారణంగా మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం,మొక్కలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో రైతుల్లో దిగాలు కనిపిస్తోంది.పూత, కాత కూడా సరిగా రాకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతుంది. సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వర్షా భావం పరిస్థితులు కొనసాగితే అందులో సగం కూడా వస్తుందో.. లేదోననే ఆందోళన రైతుల్లో లేక పోలేదు.అయితే ఓపెన్ మార్కెట్లో ప్రస్తుతం మద్దతు ధర మించి పత్తికి రేటు పలుకుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కొంత దిగుబడి తగ్గినా ధరల కారణంగా ఆ వ్యత్యాసాన్ని పూరించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే సీజన్ ప్రారంభమయ్యే నాటికి పరిస్థితులు ఎలా ఉం టాయనేది ఇప్పుడే చెప్పలేంతున్నారు.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేల్స్, సీడ్కు మంచి డిమాండ్ ఉండడంతో ధర అనుకూ లంగా ఉంది. పత్తి కొనుగోళ్ల సీజన్ మండలంలో అక్టోబర్ లో మొదలయ్యే పరిస్థితి ఉంది. అప్పటివరకు ఇలాగే ఉంటుందా.. డిమాండ్ కొనసాగుతుందా.అలా కాకుండా ఆ ధరలు పడిపోతే ఇక్కడ ఓపెన్ మార్కెట్లో పరిస్థితి తారుమారు అవు తుందా.అనే సందిగ్ధం రైతుల్లో లేకపోలేదు.



