నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం భగవంత్ మాన్ కాన్వాయ్‌పై టమాటాలు, గుడ్లు విసిరేందుకు బీజేపీ నేత, మాజీ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ యత్నించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు బీజేపీ నేత ను వెంటనే అడ్డుకున్నాయి. శనివారం లూధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది.
అయితే ఈ ఘటనకు ముందు రోజు జరిగిన పరిణామమే తాజా చర్యకు కారణంగా తెలుస్తోంది. బటాలా సమీపంలో బిట్టూ కాన్వాయ్‌పై కొందరు గుడ్లు, టమాటాలు విసిరారు. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారని బిట్టూ ఆరోపించారు. సుమారు 100 మంది ఏఏపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, తన కాన్వాయ్‌లోని తొలి వాహనం అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.



