Saturday, September 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

- Advertisement -

 జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతిలలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతి, పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి గ్రామమలో ఉన్న ప్రజలకు అవసరమైన సేవలను అందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అదేవిదంగా ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విడతల వారీగా లబ్దిదారులకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డిఎల్పిఓ లక్ష్మణ్, ఎంపీడీవో భూమారావు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -