- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఆదివారం రోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగకుండా ఎన్పీడీసీఎల్ ఏఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను. పునరుద్ధరిస్తున్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే ఆయే ప్రధానమైన కూడళ్ళ వద్ద కిందికి ఉన్న విద్యుత్ వైర్లను ముందుగానే సరి చేశారు. శోభయాత్ర మార్గంలో గణేష్ విగ్రహాలు ఎత్తుగా ఉన్నప్పుడు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి మళ్ళీ పునరుద్దరింస్తున్నారు. శోభాయాత్ర రాత్రి పూట కొనసాగడంతో ఆయా గల్లీలో ఎఈ దగ్గరుండి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
- Advertisement -



