Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉపాధ్యాయ ప్రశంస పత్రాలు అందుకున్న పద్మ, కవిత, అరుణ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయ ప్రశంస పత్రాలు అందుకున్న పద్మ, కవిత, అరుణ్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావు పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ,ఉపాధ్యాయురాలు బి.కవిత,ఎస్సికాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు డబ్ల్యూ.అరుణ్ కుమార్ లు ఎంపికైయ్యారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,ఎస్పీ,జిల్లా విద్యాశాఖ అధికారి,అదనపు కలెక్టర్ తదితర ఉన్నతాధికారులచే శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కారం చేసి,ప్రశంస పత్రాలను అందజేశారు.ప్రయివేటు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్,పాఠ్య పుస్తకాలు,ఏకారుప దుస్తులు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -