Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ బిల్లులకై ప్రజావాణిలో మాజీ సర్పంచ్ ఫిర్యాదు

పెండింగ్ బిల్లులకై ప్రజావాణిలో మాజీ సర్పంచ్ ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని హెచ్‌కేలూరు గ్రామ మాజీ సర్పంచ్‌ నీలావతి హనుమండ్లు పెండింగ్‌ బిల్లులు ఇప్పించాలని ప్రజావాణిలో ఎంపీడీఓ సాయిలుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగేండ్ల క్రితం మేము సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికై చేసిన పనుల పెండింగ్‌ బిల్లులు నేటికి విడుదల కాలేదని వాపోయారు. అప్పులు చేసి పనులు జరిపించామనీ, ఆ నగదుకు ఇంకా మిత్తీలు కడుతున్నామని ఆవేదన చెందారు. గత నాలుగేండ్లుగా పెండింగ్‌ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. మాకు బిల్లులు చెల్లించి, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -