Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

- Advertisement -

ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ చెన్నయ్య 
నవతెలంగాణ-మిడ్జిల్ 

ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా కాంగ్రెస్  పార్టీ కార్యకర్తలే అవగాహన కల్పించాలని ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షులు  చెన్నయ్య అన్నారు. సోమవారం మండలంలోని చిల్వేర్ గ్రామంలో సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి  ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎస్సీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు . చిల్వేర్ గ్రామ చైర్మన్గా చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గా చెన్నకేశవులు, ప్రధాన కార్యదర్శిగా రాజు, సహాయ కార్యదర్శిగా రాజు, కోశాధికారిగా శేఖర్, సోషల్ మీడియా సాయినాథ్, కార్యవర్గ సభ్యులు గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ డైరెక్టర్ సత్యనారాయణ గౌడ్, ఉపసర్పంచ్ వార్డు నెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -