Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొండిబాగు వద్ద బ్రిడ్జిని నిర్మించాలి

మొండిబాగు వద్ద బ్రిడ్జిని నిర్మించాలి

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండలంలోని రావిరాల క్రాస్ వద్ద నుండి మునిగిలవీడు స్టేజి వద్ద కలిసే నేషనల్ హైవే రోడ్డు మార్గం మొండి వాగు వద్ద రెండు బ్రిడ్జిలను నిర్మించి రైతులకు న్యాయం చేయాలని ఆ ప్రాంత రైతులు ఎండి అఫ్జల్, కొమ్మనబోయిన శ్రీశైలం, బత్తిని వెంకటేశ్వర్లు, గువ్వా ఉప్పలయ్య, బొమ్మన బోయిన సతీష్, బోడ మాంగ్య రైతులు సంబంధిత అధికారులను కాంట్రాక్టులను కోరినట్లు తెలిపారు. సోమవారం మొండి వాగు వద్ద సంబంధిత వాళ్ళతో మాట్లాడి నిరసన కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు కురిసినప్పుడల్లా పెద్ద వరద ఉధృతం వచ్చి వాగు ద్వారా మీరు వెళ్లిపోతుందని ఒక్కొక్కసారి వాగు మురళి పోయి కూడా ప్రకటి జలప్రహం పోతుందని దాంతో కొంతమంది రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో రావిరాల కొంతమంది రైతులు మునగలవీడు రావిరాల మదనతోర్తి రైతుల పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ఇప్పటికైనా నష్టం జరగకుండా ఉండాలంటే మొండి వాగు వద్ద ప్రవహించే చోట రెండు పెద్ద బ్రిడ్జిలను నిర్మించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతుల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -