వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘ఇంప్యూర్’. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి కృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఈవెంట్లో ట్రైలర్‌తో పాటు పాటను కూడా లాంచ్ చేశారు. స్పెషల్ గెస్ట్‌గా ఈ వేడుక కి వచ్చిన డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ,’ఈ ఈవెంట్‌కి రావడానికి రెండే మేయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా బాస్ కృష్ణవంశీ ఫోన్ చేసి చెప్పారు. ఆయన చెప్తే కాదనడానికి లేదు. సెకండ్ డైరెక్టర్ నిశాంతి గురించి. నిశాంతి నాకు 15 ఏళ్లుగా తెలుసు. ప్రతీ తెలుగు వాళ్లకు ఒక సినిమా చేయాలని డ్రీమ్ ఉంటుంది. అందుకే ప్రపంచంలో తెలుగు ఆడియెన్స్ చాలా గొప్పవాళ్లు. శ్రీదేవి మీ అమ్మాయి డ్రీమ్ నెరవేర్చినందుకు నిజంగా మిమ్మల్ని అప్రిసియేట్ చేయాలి. పేరేంట్స్ ఎంకరేజ్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలం. ఈ సినిమా మంచి హిట్టవ్వాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్ నిశాంతి మాట్లాడుతూ,’ఒక మనిషి ప్యూర్‌గా ఉండాలా? ఇంప్యూర్గా ఉండాలా? అనేది సొసైటి డిసైడ్ చేస్తుంది. వారాహి వచ్చి కథ నాకు చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాయి. ఒక పెళ్లి క్యాన్సల్ అవడం వల్ల ముగ్గురి పరిస్థితి ఎలా మారింది అనేది ఈ సినిమా కథ’ అని తెలిపారు.
హీరో సాయికృష్ణ మాట్లాడుతూ,’ సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అని చెప్పారు.
హీరోయిన్ యష్న మాట్లాడుతూ,’ఈ సినిమాలో నేను సంధ్య పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉంటుంది’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ రామ్కీ మాట్లాడుతూ,’ నాకు ఫస్ట్ సినిమాకే నంది అవార్డు వచ్చింది. నేను ఇప్పుడు మూడో సినిమా చేశాను. దీనికి మా అక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేసింది. అప్పటికే ఇంప్యూర్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా చేస్తూ.. ఒక మంచి సినిమాను అందించి నందిని రెడ్డి ప్రతీ మహిళ మనసులో ఒక బంగారంలాంటి డైరెక్టర్‌గా తయారైపోయారు. ప్రతీ ఇంట్లో లేడీస్ జెంట్స్‌ను, ఫ్యామిలీని తీసుకెళ్లే సినిమా చేశారు. అదే విధంగా ఇంప్యూర్ సినిమా కూడా హిట్ అవ్వాలని డైరెక్టర్‌కు కంగ్రాట్స్ చెప్తున్నాను’ అని అన్నారు.
అరుదైన సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



