కధానాయిక రష్మిక మందన్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’లో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న’మైసా’ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.
హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ,’టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు పెర్ఫార్మెన్స్ అంటే ఎమోషన్స్‌తో చేశాను. ఇది నాకు కొత్త టెరిటరీ. ఇంత యాక్షన్ ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఒక నెర్వస్‌నెస్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అందులో కొత్తదనం ఉండాలని నేను ఫీల్ అవుతాను. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో ఎమోషనల్‌గా ఏముంటుందో అంతా ఆ ఫిల్మ్‌లో ఇచ్చాను. ‘మైసా’ కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. డైరెక్టర్ నాతో చాలా రిస్కీ స్టంట్స్ చేయించారు. కథ అద్భుతంగా అనిపించింది. మేము చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా ఇది. మీకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకం ఉంది’ అని తెలిపారు.
డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ,’ ఈ కథ రాస్తున్నప్పుడే రష్మిక హీరోయిన్‌గా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇప్పటివరకు మీరు క్యూట్‌గా, స్వీట్‌గా ఉండే రష్మికను చూశారు. ఈ సినిమాలో రష్మిక ఫేస్ మీద బ్లడ్ పెడితే ఎలా ఉంటుందో అది చూస్తారు’ అని చెప్పారు.
ప్రొడ్యూసర్ అజయ్ మాట్లాడుతూ,’రష్మిక ఈ సినిమా కోసం ప్రాణాలు పెట్టి పని చేశారనిపిస్తుంది. కొన్ని కొన్ని స్టంట్స్ చేయడానికి లైఫ్‌ని కూడా రిస్క్ చేశారు. మా డైరెక్టర్ రవీంద్ర చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని అన్నారు.
ఓ గోండ్ మహిళ పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



