- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సింగరేణి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకొని నివాసముంటున్న వారికి త్వరలోనే పట్టాలు అందజేస్తామని మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంచిర్యాలలో 22ఏ జీవో సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బర్త్ డే వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రేమ్ సాగర్ రావు కృషిని ప్రశంసించారు. పార్టీలో సీనియర్లకు, అసలైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని తెలిపారు.
- Advertisement -



