Tuesday, September 22, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓయో హోటల్‌లో విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి హోటల్‌లో బస చేసిన యువతి, అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువతి ముఖం, తలపై గాయాలు, రక్తపు మరకలు, ఖాళీ మద్యం బాటిళ్లు లభించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -