Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయంఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు బ్రేక్‌ఫాస్ట్ ప‌థ‌కం..ప్రారంభించిన సీఎం విజ‌య్

ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు బ్రేక్‌ఫాస్ట్ ప‌థ‌కం..ప్రారంభించిన సీఎం విజ‌య్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : త‌మిళ‌నాడులోని ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఇక‌పై 6-8 త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కూడా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నుంది ప్ర‌భుత్వం. ఈ ప‌థ‌కాన్ని త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఇప్ప‌టికే పెరుత‌లైవార్ కామ‌రాజార్ అల్పాహారం పేరుతో ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఈ ప‌థ‌కం అమ‌లవుతోంది.

ఇప్ప‌టిదాకా ఒక‌టి నుంచి ఐదో త‌రతి పిల్ల‌ల‌కు మాత్ర‌మే ప్ర‌భుత్వ స్కూళ్లలో అల్పాహారం అందిస్తుండ‌గా.. ఇక‌పై ఎనిమిదో త‌ర‌గ‌తి వర‌కు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. దీంతో విద్యార్థినీ, విద్యార్థుల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. మంగ‌ళ‌వారం సీఎం విజ‌య్.. చెన్నై, తిరువ‌న్మియుర్, గాంధీ గ్రామంలో ఉన్న ప్ర‌భుత్వ స్కూల్‌లో ప‌థ‌కాన్ని విస్త‌రించారు. ఈ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌తో క‌లిసి ఉద‌యం అల్పాహారం చేశారు. గ‌వ‌ర్న‌మెంట్ స్కూళ్ల‌తోపాటు, గ‌వ‌ర్న‌మెంట్ ఎయిడెడ్ స్కూళ్ల‌లో కూడా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తారు.

ఈ ప‌థ‌కం ఇప్పుడు రాష్ట్రంలోని 15,454 స్కూళ్ల‌లో, 15.30 లక్ష‌ల మంది విద్యార్థుల‌కు దీని ద్వారా ల‌బ్ధి క‌లుగుతుంది. ఈ ప‌థ‌కాన్ని విస్త‌రించేందుకు అద‌నంగా ఏడాదికి రూ.217.63 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. మొత్తం ప‌థ‌కానికి అయ్యే ఖ‌ర్చు ఏడాదికి రూ.724 కోట్ల‌కు చేరింది. గ‌తంలో ఈ ప‌థ‌కానికి సీఎం బ్రేక్‌ఫాస్ట్ అనే పేరుండేది. అయితే, త‌మిళ‌నాడు మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దివంగ‌త‌ కే కామ‌రాజ్ పేరు మీద ఈ ప‌థ‌కాన్ని తిరిగి ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -