- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద మంగళవారం ఐదుగురు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కాలనీ అభివృద్థి కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి రోజూ ఒక కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ ఆధ్వర్యంలో ఐదుగురు జంటలు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
- Advertisement -



