- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభ పురస్కారాలలో మండలంలోని లెంకలపల్లి ఎంపీయుపిఎస్ కు చెందిన ఎస్ జి టి గ్యార వెంకటేష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రతిభ పురస్కారాల పంపిణీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ బి చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆయన ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
- Advertisement -



