Tuesday, September 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పుస్తక పఠనం సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగం: కలెక్టర్

పుస్తక పఠనం సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగం: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 
పుస్తక పఠనం విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 45 స్కూల్ కాంప్లెక్స్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వహించిన “రీడతాన్”జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ తో కలిసి బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయస్సు నుంచే పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవడం ద్వారా విద్యార్థుల్లో జ్ఞానం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, వ్యక్తీకరణ సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. పఠనాన్ని విద్యార్థుల దైనందిన జీవితంలో భాగంగా చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో గత నాలుగు సంవత్సరాలుగా ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలు నెరవేరుటకు వీలుగా ప్రాథమిక స్థాయి విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించుటకు జిల్లా విద్యాశాఖ నిర్వహిస్తున్న కేబి రీడతన్ కార్యక్రమాన్ని అభినందించారు. 

విజేతలు వీరే..
జిల్లాలోని 45 స్కూల్ కాంప్లెక్స్ లలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ప్రథమ బహుమతి దహేగాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న తుమ్మిడి వశిష్ట సొంతం చేసుకోగా, ద్వితీయ స్థానంలో రెబ్బెన మండలం గొల్లగూడ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐశ్వర్య, తృతీయ బహుమతి దహేగా మండలం చిన్న రాసిపెళ్లి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న రౌతు సాన్వి పొందారు. విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్, జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, రూమ్ టు రీడ్ జిల్లా ప్రతినిధి మధు, పాల్గొనగా న్యాయ నిర్ణేతలుగా శ్రీనివాస్, నాగేందర్, రేవతి వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -