Tuesday, September 22, 2026
E-PAPER
Homeఖమ్మంగణేష్‌ మండపాలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

గణేష్‌ మండపాలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

- Advertisement -

– ఉత్సవ మూర్తుల వద్ద ప్రత్యేక పూజలు 
– అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి 
నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయక నవరాత్రి ఉత్సవాల మండపాలను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా విజయకుమార్‌తో కలిసి మంగళవారం దర్శించారు. పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న జవహర్ నగర్‌, శ్రీ కృష్ణుడి గుడి, జూపల్లి కంటి హాస్పిటల్ రోడ్డు, శ్రీ కోదండ రామాలయం, జేవీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న శ్రీ గణేష్ ఆలయాల వద్ద ఏర్పాటైన గణేష్ ఉత్సవాల మండపాలను దర్శించుకున్న మంత్రి  ప్రత్యేక పూజలు జరిపించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.‌ ఆయా మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను మంత్రి పొంగులేటి ప్రారంభించారు.

ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్‌పర్సన్ మహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, మందపాటి ముత్తారెడ్డి, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), ఉడతనేని అప్పారావు, కొత్తూరు ప్రభాకరరావు, తోట గణేష్, కౌన్సిలర్లు దూదిపాల రాంబాబు, తోట సుజలరాణి, ఉప్పు నాగమణి, విరివాడ అపర్ణ, బండారు శరత్ చంద్ర, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, పర్సా మానస పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -