- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి బలవంతంగా అబార్షన్ చేయించారనే తీవ్ర ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు శ్రీనివాసులు రెడ్డిని అరెస్టు చేయవద్దని, ఆయనపై ఎలాంటి బలవంతపు చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని హైదరాబాద్ పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -



