Wednesday, September 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవచ్చే మూడ్రోజులు వర్షాలు

వచ్చే మూడ్రోజులు వర్షాలు

- Advertisement -

పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌
జంట నగరాలతో సహా 417 ప్రాంతాల్లో కురిసిన వర్షం

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు(బుధ, గురు, శుక్రవారాలు) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా హెచ్చరించారు. కాగా జంట నగరాలతో పాటు 417 ప్రాంతాల్లో వర్షం కురిసింది. బుధవారం అతిభారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ , కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఆరెంజ్‌ ‌హెచ్చరికలు జారీ చేశారు. 24వ తేదీకి సంబంధించి కొమ్రంభీమ్‌ ఆసిఫాబాద్, ‌మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్న నేపథ్యంలో రెడ్‌ అలర్ట్‌ ‌జారీ చేశారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌,నిజామలబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే నేపథ్యంలో ఆ జిల్లాలకు ఆరెంజ్‌ ‌హెచ్చరికను విడుదల చేశారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 417 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ ‌జిల్లా బంట్వారం మండలం నాగారంలో అత్యధికంగా 5.6 సెంటీమీటర్ల వర్షం పడింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్లగొండ, మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, పెద్దపల్లి, నిజామాబాద్‌ ‌జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వాన పడింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో 136 ప్రాంతాల్లో వర్షం కురిసింది. హిమాయత్‌‌నగర్‌ ‌మండలం విఠల్‌‌వాడిలో అత్యధికంగా 3.3 సెంటీమీటర్ల వాన పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -