- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. వరుసగా వారం రోజులు కురిసిన వర్షాలు ఈ రోజు కాస్త విరామం ఇచ్చాయి. అయితే రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తాజా అలర్ట్ ప్రకారం.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో చెల్లాచెదురుగా వర్షాలు కురవనున్నాయి. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ పరిసరాల్లో వర్షాలు కురుస్తాయి.
- Advertisement -