నవతెలంగాణ – జుక్కల్ : భారత రాజ్యాంగ నిర్మాత జాతిపిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని నాయకుడు బస్వాపూర్ సురేష్ గొండ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినమును పురస్కరించుకొని మంగళవారము గ్రామం లోని మెయిన్ రోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి దిక్సూచి అనే అన్నారు . మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా గుర్తించిన మేధావి కేవలము డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మన జాతిపిత అంబేద్కర్ ఏ కులానికో, ఈ వర్గానికో, ఏ మతానికో చెందిన వ్యక్తి కాదని ఈయన అందరివాడు అని తెలిపారు. కొన్ని శక్తులు ఈయన పేరును చెరిపివేయాలని చూస్తున్నారు కానీ ఈయన పేరును ఎవరు కూడా చెరిపి వేయలేరని ఈయన చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బస్వంత్, జర్నలిస్ట్ గడ్డం విజయ్ కుమార్, సురేష్ గొండ, ఎమ్మార్పీఎస్ నాయకులు, దళిత నాయకులు, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ అందరివాడు, ప్రపంచ మేధావి: బస్వాపూర్ సురేష్ గొండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



