Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్లో ఘనంగా జార్జిరెడ్డి వర్ధంతి వేడుకలు.!

కొయ్యుర్లో ఘనంగా జార్జిరెడ్డి వర్ధంతి వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్లో భారత ఐక్య యువజన సమాఖ్య ఆధ్వర్యంలో, విప్లవ స్పూర్తికి ప్రతీక అయిన జార్జీరెడ్డి వర్ధంతి సభను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి యువైఏప్ఐ రాష్ట్ర కార్యదర్శి అక్కల బాపు యాదవ్ మాట్లాడారు. జార్జిరెడ్డి చూపిన పోరాట మార్గం నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులు, రైతులు, పేదల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వారి హక్కుల సాధన కోసం యువజన సంఘాలు ఐక్యంగా పోరాడాలన్నారు.జర్జీ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ, సామాజిక న్యాయం కోసం, ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు గడ్డం లచ్చన, గొట్టం ఎల్లన్న, గడ్డం సమ్మక్క, ఎడ్ల నారాయణ, అర్వెంది పోచయ్య, సేద మల్లేష్, గొట్టం సమ్మక్క, ఎండీ. సయ్యేదు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -