Sunday, April 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌లోనూ యుద్ధ వ్యతిరేక నిరసనలు

ఇజ్రాయిల్‌లోనూ యుద్ధ వ్యతిరేక నిరసనలు

- Advertisement -

నెతన్యాహు, ట్రంప్‌పై ఆగ్రహం
ఆందోళనకారులపై పోలీసుల బలప్రయోగం


జెరూసలేం : యుద్ధ వ్యతిరేక నిరసనలు ఇజ్రాయిల్‌లోనూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. శనివారం హబీమా స్క్వేర్‌ వద్దకు భారీసంఖ్యలో ఆందోళనకారులు తరలివచ్చారు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌లకు వ్యతిరేకంగా ప్లకార్డులు, నిరసనలతో హౌరెత్తించారు. ఇజ్రాయిల్‌ పోలీసులు బలప్రయోగానికి దిగారు. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి రెచ్చిపోయారు. బలవంతంగా కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ”మా గొంతు నోక్కినా.. యుద్ధ వ్యతిరేక నిరసనలు ఆపేదిలేదు” అని వారు స్పష్టం చేశారు. నెలరోజులుగా జనావాసాలపై దాడిచేసే అధికారం ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. అమాయకులను చంపేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -