Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంపీఎం మోడీతో ఆస్ట్రియా ఛాన్సలర్ భేటీ

పీఎం మోడీతో ఆస్ట్రియా ఛాన్సలర్ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నాలుగు రోజుల విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్ డాక్టర్ క్రిస్టియన్ స్టాకర్ భారత్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈక్ర‌మంలోనే ఢిల్లీలోని హైద‌రాబాద్ హౌస్‌లో పీఎం మోడీతో ఆస్ట్రియా ఛాన్సలర్ స‌మావేశమైయ్యారు. ఇరువురు నేత‌లు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌నున్నాయి.ముఖ్యంగా రక్షణ, సెమీకండక్టర్లు, క్వాంటం, బయోటెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణ‌యించారు.”ఇండియా-ఆస్ట్రియా వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్” ను నేడు అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో, సైనిక సంఘర్షణల ద్వారా సమస్యలు పరిష్కారం కావని, ఉక్రెయిన్- పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొనాలని ఇరు నేతలు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -