Saturday, May 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన 

నూతన రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన 

- Advertisement -

ఆయిల్ ఫామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం
పంట మార్పిడితో అధిక ఆదాయం
జిల్లా ఉద్వాన అండ్ పట్టు పరిశ్రమల అధికారి జీనుగు మరియాన్నః
నవతెలంగాణ-నెల్లికుదురు 

ఆయిల్ ఫామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ మొదలైన  మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం పంట మార్పిడి:  కుటీర పరిశ్రమ అయిన మల్బరీ సాగు ద్వారా ఎకరానికి రెండు లక్షల రూపాయల ఆదాయం – యువత కు స్వయం ఉపాధి – ప్రభుత్వం ద్వారా 5 లక్షల వరకు రాయితీ ఇస్తుందని జిల్లా ఉద్వాన అండ్ పట్టు పరిశ్రమల అధికారి జీనుగు మరియన్న  , సరే కల్చర్ అధికారి రాజయ్య తెలిపారు. శనివారం నెల్లికుదురు గ్రామంలో మల్బరీ సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి, మల్బరీ రైతు పి. సరస్వతి  ద్వారా నూతన రైతులకు మల్బరీ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. మల్బరీ సాగు ద్వారా సంవత్సరానికి 6 నుండి  8 పంటలు తీసుకుని, రెండు లక్షలకు పైగా ఆదాయం పొందవచ్చు అని రైతు తెలిపారు.

ఈ పంటకు ఎలాంటి ఎరువులు, పురుగు మందులు అవసరం లేదు. దళారి లు లేని పంట. ప్రభుత్వ మార్కెట్ లు జనగాం, తిరుమలగిరి లలో కొనుగోలు జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగి వలె ప్రతి నెలా  ఆదాయం వచ్చును. ఈ సాగు వలన ప్రకృతి సేద్యం సాధ్యమై పర్యావరణానికి మేలు చేస్తుందని అన్నారు. మన డిమాండ్ కు తగ్గట్టు సిల్క్ లేనందున విదేశాల నుండి మనం ముఖ్యంగా చైనా దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పంట సాగుకు కేంద్ర సిల్క్ బోర్డు ద్వారా ఒక యూనిట్ కు 5 లక్షలకు పైగా మొక్కలపై, షెడ్డు నిర్మాణానికి, నిర్వహణకు రాయితీ ఇస్తున్నారని చెప్పారు. కనుక డిమాండ్ ఉన్న మల్బరీ, ఆయిల్ పామ్, కూరగాయలు, కంది, పెసర, మినుము, బొబ్బర, మునగ, ఆకు కూరలు, నూనె గింజలు అయిన ప్రొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమలు, పండ్లు, పూలు, పుట్టగొడుగులు, తేనె మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న వాటిని, మన డైలీ అవసరాలకు అనుగుణంగా రైతులు అందరూ సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, సెరికల్చర్ అధికారి రాజయ్య, రైతులు జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -