Wednesday, April 15, 2026
E-PAPER
Homeక్రైమ్బేగంపేటలో అగ్నికి ఆహుతైన కారు

బేగంపేటలో అగ్నికి ఆహుతైన కారు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: బేగంపేటలో ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. మంగళవారం రాత్రి వరంగల్‌ నుంచి మణికొండ వైపు వెళ్తున్న ఒక కారు బేగంపేటలోని లైఫ్ స్టైల్ భవనం సమీపానికి చేరుకోగానే, ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు చెలరేగాయి.

ఘటన చోటుచేసుకున్న సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు వెంటనే అప్రమత్తమై కారును పక్కను నిలిపివేసి కిందకు దిగారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ప్రధాన రహదారిపై కారు తగలబడటంతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. కారు ముందుభాగం పూర్తిగా దగ్ధమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -