Sunday, April 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా తగ్గిన చికెన్ ధరలు..

భారీగా తగ్గిన చికెన్ ధరలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చికెన్ లవర్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే. గతవారం భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఈ వారం అమాంతం తగ్గిపోయాయి. మార్చి నెల ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.360- రూ.400 పలికింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు చనిపోవడం, వాటి దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫారమ్ల యజమానులు ధరలను పెంచారు. స్కిన్ లెస్, నార్మల్ చికెన్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరడంతో.. చికెన్ ప్రియులంతా సీ ఫుడ్ వైపు మళ్లారు. వారంరోజుల తర్వాత కిలో చికెన్ రేటు ఏకంగా రూ.100 వరకూ తగ్గింది. హైదరాబాద్ లో నేడు స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.270గా ఉండగా.. అటు వరంగల్ లోనూ అదే ధర కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -