Thursday, September 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపురోగమనంలో చైనా

పురోగమనంలో చైనా

- Advertisement -

నాటి జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనతో పోలిస్తే నేడు గణనీయ మార్పులు
టెక్‌, తయారీ రంగాలలో 
అసమాన 
అభివృద్ధి

బీజింగ్‌ : సుమారు దశాబ్ద కాలం తర్వాత చైనా అధినేత జిన్‌పింగ్‌ తొలిసారిగా మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌ వెలుపల ఉన్న ఆండ్రూస్‌ వైమానిక స్థావరం వద్ద అమెరికా అధ్యక్షు డు ట్రంప్‌ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌ అధ్యక్ష భవనం వద్దకు కారులో వచ్చే వరకూ వేచి ఉండకుండా ట్రంప్‌ విమానా శ్రయానికి వచ్చారు. అనంతరం శ్వేతసౌ ధంలో సైనిక విమానాల విన్యా సాలతో సుమారు 500 మంది సైనికులతో స్వాగత కార్యక్రమం జరిగింది. దశాబ్ద కాలం క్రితం అమెరికాలో జిన్‌పింగ్‌, ట్రంప్‌ కలుకున్నప్పటికీ ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

టెక్‌ దిగ్గజంగా ఆవిర్భావం
2017లో ట్రంప్‌ యొక్క మార్‌-ఏ-లాగో రిసార్టులో ఇరువురు నేతల భేటీ జరిగింది. ఆ సమయంలో అనేక రంగాల లో అమెరికా కంటే చైనా వెనుకబడి ఉంది. సాంకేతికంగా, వాణిజ్య పరంగా చైనాతో ట్రంప్‌ ఘర్షణలకు దిగే అవకాశాలు అప్పుడు ఎక్కువగా కన్పించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. నేడు పరివర్తన చెందిన దేశానికి జిన్‌పింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ప్రపం చంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఓ టెక్‌ దిగ్గజంగా ఆవిర్భవిం చింది. దేశీయ సాంకేతిక ప్రతిభ ఏఐ నమూనాలను సిలికాన్‌ వ్యాలీ యొక్క అగ్రస్థానానికి మరింత చేరువ చేసింది. చైనా అంతరిక్ష సంస్థలు ప్రపంచ ఛాంపి యన్‌ స్పేస్‌ఎక్స్‌ను లక్ష్యంగా చేసుకొని పునర్వినియోగ రాకెట్లను ప్రయోగించి విజయవంతంగా ల్యాండ్‌ చేస్తున్నాయి. ఇంధనం నుంచి ఏఐ, రోబోట్లు, మెమరీ చిప్‌ల వరకూ వివిధ రంగాల కంపెనీలు గత సంవత్సరం బడా స్టాక్‌మార్కెట్లలో ఆరంగేట్రం చేశాయి.

వాణిజ్యంలో ముందంజ
చైనా తయారీ రంగం గత సంవత్సరం 1.2 ట్రిలియన్‌ డాలర్ల ప్రపంచ వాణిజ్య మిగులును నమోదు చేసింది. ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ ప్యానల్స్‌, చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ దీనికి కొంత వరకూ కారణమైంది. ముఖ్యంగా అరుదైన భూ ఖనిజాలపై చైనాకు ఉన్న పట్టు…. ట్రంప్‌ యొక్క ‘అమెరికా ఫస్ట్‌’ వాణిజ్య యుద్ధంపై బీజింగ్‌కు ఓ ప్రత్యేకమైన ఆధిక్యతను కట్టబెట్టింది. ఓ వైపు అమెరికా తన మిత్రదేశాలను దూరం చేసుకుంటూ ఇరాన్‌ యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక నానా అవస్థలు పడుతుంటే మరోవైపు జిన్‌పింగ్‌ చైనాను బాధ్యతాయుతమైన, నమ్మదగిన ప్రపంచ నాయకురాలిగా నిలిపి దాని ప్రతిష్టను పెంచుతున్నారు. ఇప్పుడు బీజింగ్‌లో సర్వత్రా ఒకే అభిప్రాయం వినిపిస్తోంది. అదేమిటంటే చైనాను అమెరికా ఏకపక్షంగా డిమాండ్లు చేసే రోజులు పోయాయి. ‘తొమ్మిది సంవత్సరాల కంటే ఇప్పుడు చైనాలో ఎంతో ఆత్మవిశ్వాసం కన్పిస్తోంది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అమెరికాను అదుపులో ఉంచడానికి చైనా ఒక సమర్ధవంతమైన మార్గాన్ని కనుగొంది’ అని షాంఘైలోని ఫుడాన్‌ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ డీన్‌, ప్రభుత్వ విదేశాంగ విధాన సలహాదారు వూ జిన్‌బో చెప్పారు. చైనాను అమెరికా మరింత సమానత్వంతో, గౌరవంతో చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

బీజింగ్‌ ‘రెడ్‌లైన్లు’
మేలో బీజింగ్‌లో ఇరు పక్షాల సమావేశమైనప్పుడు ‘నిర్మాణాత్మక వ్యూహాత్మక స్థిరత్వాన్ని’ కొనసాగించేందుకు అంగీకరించాయి. అమెరికాతో ఘర్షణలు, వివాదాలను నివారించడానికి జిన్‌పింగ్‌ వాషింగ్టన్‌ పర్యటన ఉపయోగపడుతుంది. అయితే అదే సమయంలో జిన్‌పింగ్‌ అమెరికాకు ఓ వాస్తవాన్ని కూడా తెలియజేయబోతున్నారు. అదేమిటంటే అమెరికాతో చైనా స్థిరమైన సంబంధాలను కోరుకుంటున్నప్పటికీ బీజింగ్‌ ఎదుగుదల మాత్రం వాటిపై ఆధారపడి లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్‌ డైలీలో తాజాగా వచ్చిన ఓ సంపాదకీయంలో తైవాన్‌, మానవ హక్కులు బీజింగ్‌కు దాటలేని ‘రెడ్‌లైన్లు’ అని అమెరికాలోని చైనా రాయబారి షీ ఫెంగ్‌ హెచ్చరించారు. ‘చైనా సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను ఉల్లంఘించకూడదు. తైవాన్‌ సమస్య, ప్రజాస్వామ్యం-మానవ హక్కులు, చైనా రాజకీయ వ్యవస్థ-అభివృద్ధి పథం, అభివృద్ధి చెందేందుకు దానికి ఉన్న హక్కుకు సంబంధించిన నాలుగు రెడ్‌లైన్లను సవాలు చేయకూడదు’ అని ఆ సంపాదకీయంలో స్పష్టం చేశారు.

ఏఐపై ఆసక్తి
జిన్‌పింగ్‌ విశ్వాసానికి కారణం అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా వాణిజ్యాన్ని విస్తరించుకోగల చైనా సామర్ధ్యం, సాంకేతికంగా స్వయం సమృద్ధిని పెంపొందించుకోవడం. రోబోటిక్స్‌, ఏఐ, బయోటెక్‌, అంతరిక్షం, నూతన ఇంధనం, చిప్స్‌ వంటి అత్యాధునిక రంగాలలో సొంత సాంకేతికతను నిర్మించుకోవడానికి, ఆ టెక్నాలజీని పరిశ్రమలలో వినియోగించడానికి చైనా భారీగా నిధులను వెచ్చించింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొని ఓ టెక్‌ శక్తిగా చైనా ఎదగగలిగింది. ఇటీవల యాపిల్‌ సంస్థ ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన తన తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ మోడల్‌ను చైనాకు చెందిన హువావే సంస్థ ఏడు సంవత్సరాల క్రితమే విడుదల చేసింది. ఈ కంపెనీ తదుపరి తరం అసెండ్‌ ఏఐ చిప్‌లను వచ్చే ఏడాది లోగానే విడుదల చేయబోతోంది. ఏఐని అందిపుచ్చుకోవాల్సిన అవకాశంగా అనేక మంది చైనీయులు భావిస్తున్నారు.

ట్రంప్‌ కంటే జిన్‌పింగ్‌ మేలు
ఆర్థిక రంగంలో ఇరుపక్షాల బలాబలాలు సమానంగా ఉండడంతో ఎవరికీ ఆధిక్యత లేదని, కాబట్టి పరస్పరం దూకుడుగా వ్యవహరించే పరిస్థితులు లేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. జూలైలో ప్రచురితమైన ప్యూ రిసెర్చ్‌ సర్వే ప్రకారం…సర్వే జరిపిన 36 దేశాలలో చాలా వరకూ అమెరికాపై కంటే చైనా పైనే ప్రజలకు సానుకూల దృక్పథం కన్పించింది. ప్రజల విశ్వాసాన్ని పొందడంలో ట్రంప్‌ కంటే జిన్‌పింగే ముందంజలో ఉన్నా రని నిర్వాహకులు గమనిం చారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ వ్యాపారాల కోసం చైనా ఏఐ నమూనాలనే ఉపయోగి స్తున్నారు. చైనా ఎలక్ట్రిక్‌ వాహనాలను నడుపు తున్నారు. జిన్‌పింగ్‌ తన అమెరికా పర్యటనలో రెండు విషయాలను స్పష్టం చేయబోతున్నారు. ఒకటి.. ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న చైనా బ్యాంకులు, కంపెనీలపై ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిం చవద్దు. రెండోది…ఘర్షణలను ముగించడానికి సైనిక పరిష్కారాలు, ఆర్థిక ఆంక్షల గురించి మరచిపొండి. సహేతుకమైన శాంతి ఒప్పందం కోసం చర్చల వేదిక వద్దకు రండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -