Friday, June 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాల‌మూరులో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న

పాల‌మూరులో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాల‌మూరులో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. కోల్లాపూర్ మండ‌లం నార్ల‌పూర్ ప్యాకేజీ-2,3 కాల్వ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్నారు. సంబంధింత అధికారుల‌తో ప‌నుల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్త‌మ్ కుమార్, జూప‌ల్లి, శ్రీ‌హారి ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కుమ్మెరలో పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-8 స్టేజ్-3 పంప్‌హౌస్, వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీ – 9, 10, 11 పనులు పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్ లోని పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు చెందిన కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15 పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ లో పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు చెందిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు ఉద్దండాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -