- Advertisement -
ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు
సీఎం సభను విజయవంతం చేయాలని మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీరాజు పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాళేశ్వరంలోని మెదిగడ్డ నస్తూర్ వెళ్లిలో సోమవారం నిర్వహించే సిఎం రేవంత్ రెడ్డి సభకు అధిక సంఖ్యలో నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్లు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు నేతృత్వంలో రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొన్నారు.
- Advertisement -



