Saturday, August 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నవతెలంగాణ ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన కలెక్టర్

నవతెలంగాణ ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక సంచికను శనివారం కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నవతెలంగాణ ప్రతినిధులు, బృంద సభ్యుల సమక్షంలో డీసీసీ అధ్యక్షులు డా.నరేష్ జాధవ్ తో కలిసి కలెక్టర్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవతెలంగాణ బృందం కలెక్టర్‌ను కలిసి ప్రత్యేక సంచికను అందజేసింది. అనంతరం కలెక్టర్ బృంద సభ్యులతో మాట్లాడి నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రత్యేక సంచిక రూపకల్పనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించే విధంగా ప్రత్యేక సంచికను రూపొందించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక సంచికలో కలెక్టర్‌కు సంబంధించిన ప్రత్యేక కథనం, ఆయన ఆధ్వర్యంలో జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కథనాలను ప్రచురించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలకు సంబంధించిన అంశాలను ప్రత్యేక సంచికలో పొందుపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సంచికను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే విధంగా కథనాలను ప్రచురించడం అభినందనీయమని పేర్కొంటూ నవతెలంగాణ బృందాన్ని అభినందించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని అన్నారు. అనంతరం నవతెలంగాణ బృంద సభ్యులతో కలెక్టర్ కొద్దిసేపు ముచ్చటించారు. జిల్లాలోని వివిధ అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు. కార్యక్రమంలో నవతెలంగాణ దినపత్రిక డెస్క్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి రాపత్రి దత్తాత్రి, ఉమ్మడి జిల్లా స్టాఫర్ గాజరి మహేష్, డివిజన్ ఇంచార్జి ఉష్కం సురేష్, టౌన్ రిపోర్టర్ గాజరి శ్రీకాంత్, సర్క్యులేషన్ ఇంచార్జి బండారి వంశీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -