Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం15 ఏండ్లు విడిగా ఉంటే…
విడాకులు కరెక్టే : హైకోర్టు

15 ఏండ్లు విడిగా ఉంటే…
విడాకులు కరెక్టే : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
భార్యాభర్తలు 15 ఏండ్లు విడివిడిగా జీవిస్తున్నారంటే వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైనట్లేననీ, విడాకులు మంజూరు చేయడం కరెక్టే అని హైకోర్టు పేర్కొంది. కుటుంబ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకుల డిక్రీని సమర్థిస్తూ భార్య దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. శాశ్వత భరణం కోరాలంటే హిందూ వివాహ చట్టం సెక్షన్‌–25 ప్రకారం కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దాంపత్య హక్కుల పునరుద్ధరణకు భార్య చర్యలు తీసుకోకపోవడం, రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడం వంటి అంశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
నోటీసులు లేకుండా కూల్చివేత కేసులో ఎమ్మార్వో హాజరవ్వాలి
కొండాపూర్‌లోని ప్రయివేటు స్థలంలోని కాంపౌండ్‌, వాచ్‌మెన్‌ గదిని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై హైడ్రా అధికారులతో పాటు శేరిలింగంపల్లి ఎమ్మార్వోను హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రాకు సమాచారం ఏ ప్రాతిపదికన ఇచ్చారో ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సర్వేలో అది పట్టా భూమిగా తేలినా, గత కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా చర్యలు తీసుకోవడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
24 గంటల్లో హైడ్రా బోర్డు తొలగించాలి : హైకోర్టు
చట్టప్రక్రియను అనుసరించకుండా ప్రయివేటు స్థలంలో ఏర్పాటు చేసిన హైడ్రా బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులివ్వకుండా, విచారణ జరపకుండా ఏకపక్షంగా బోర్డు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. గతంలో ఇదే స్థలానికి సంబంధించిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -