Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెరికిట్ లో ఇంటింట బడిబాట ప్రచారం 

పెరికిట్ లో ఇంటింట బడిబాట ప్రచారం 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటా బడిబాట కార్యక్రమం నిర్వహించినారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం బడిబాట నిర్వహించారు. ప్రతి ఇంటింటిని సందర్శించి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను గురించి ఉపాధ్యాయులు విద్యార్థుల తలిదండ్రులకు వివరించారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్, అల్పాహారము, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య కై డిజిటల్ పద్ధతిలో ఆన్లైన్ తరగతులను బోధిస్తున్నామని తెలిపారు. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని చెప్పారు. ప్రతినెల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల చదువు మరియు అవసరాల గురించి చర్చిస్తూ ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను పాటిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్ లిక్కి శంకర్,, ,మార్కాజ్ కమిటీ అధ్యక్షులు అజీమ్, ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -