Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహమ్మదాబాద్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు

మహమ్మదాబాద్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ- జుక్కల్ : మండలంలోని మహమ్మదాబాద్ జిపి సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి వేడుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించామని జిపి కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి గ్రామ సర్పంచ్ శకుంతల నివాళులు అర్పించాడు.గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ డాక్టర్ భీమ్రావు రాంజీ అంబేద్కర్1891 ఏప్రిల్ 14వ తేదీన అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ సైనిక స్థావరమైన “మౌ” అన్న గ్రామంలో ఇప్పటి మధ్యప్రదేశ్ లో రాంజీ మాలోజి సక్వాల్, బీమావాయి దంపతులకు చివరి సంతానంగా జన్మించారని అన్నారు. బాల్యంలో అంబేద్కర్ పలు అవమానాలను,  చిత్కారాలను అనుభవించారు. ఆరేళ్ల వయసులోనే ఆర్థిక కష్టాలలో ఉండడంతో తల్లి మరణించడం జరిగింది. 13 మంది తోబుట్టులో 9 మంది ఆ కాలం మృతి చెందారు. చిన్నతనం లేని అంటరానితనానికి  , అవమానాలకు భరించాడు. పాఠశాలలో అస్పృశ్యత వలన ఒక మూలన కూర్చోబెట్టేవారు. అన్ని భరించి అంచలంచెలుగా ఎదిగి భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగన్న, మరియు రాజా గౌడ్, జై భీమ అధ్యక్షులు,  గ్రామ ప్రజలు , తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -