Tuesday, April 28, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జరిగింది. తెలంగాణ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల నియమావళి-2020 ప్రకారం నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్ల ద్వారా ఈ ఎన్నిక చేపట్టారు.మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరు సభ్యులుగా వల్లకొండ మహేష్, మహిళా సభ్యురాలిగా సుదవేని లత ఎన్నికయ్యారు. మైనారిటీ వర్గానికి చెందిన సభ్యులుగా ఇర్ఫాన్ అలీ, మహిళా సభ్యురాలిగా ఎం.డి. ఇంత్యాజ్ పర్వీన్ ఎన్నికయ్యారు.ఎన్నిక అనంతరం కో-ఆప్షన్ సభ్యులకు కమిషనర్ కీర్తి నాగరాజు ఎన్నికల ధృవపత్రాలు అందజేశారు.ఈ సమావేశంలో చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్‌పర్సన్ తురగ సౌజన్య,వార్డు కౌన్సిలర్లు తోపారపు ప్రశాంతి,భుక్యా రాకేష్ నాయక్,కూనారపు మానస,వేముల మౌనిక,ఎలిగేటి లతిక,పల్లికొండ గంగాధర్,బత్తిని మహేశ్వరి,మచ్చ గంగలక్ష్మి,పుర్రె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -