Saturday, July 25, 2026
E-PAPER
Homeజిల్లాలుపేదల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన ప్రజా నాయకుడు ఎర్రసత్యం

పేదల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన ప్రజా నాయకుడు ఎర్రసత్యం

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
పేద ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన ఎర్ర సత్యం ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆయన చేసిన సేవలు మరువలేనివని స్తానిక నాయకులు కొనియాడారు. శనివారం మండలంలోని వాడియాల గేటు దగ్గర ఎర్ర శేఖర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు కోళ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా ఆయన చిత్రపటానికి పూలమాలసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎర్ర సత్యం ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రజా నాయకుడని కొనియాడారు. రాజకీయాలను వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతి లక్ష్యంగా కొనసాగించిన గొప్ప నాయకుడని వర్ణించారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి కోసం నిరంతరం పోరాడిన ఆయన సేవలు చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా నిలిచిన ఎర్ర సత్యమన్న ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. ఆయన చూపిన ప్రజాసేవా మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఎర్ర సత్యం ఆశయ సాధన కోసం యువత, అభిమానులు, ప్రజా సేవలో ముందుకు సాగాలని ఈ సందర్బంగా నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుల సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శేఖర్ అభిమాన సంఘం నాయకులు పల్లె తిరుపతి, రాఘవేందర్, నరేష్, లాలు, తిరుపతయ్య, వెంకటయ్య, ఉమర్, శివశంకర్, ఆంజనేయులు గౌడ్, అనిల్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -