Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి..!

కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -