- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల జనాలకు మద్నూర్ ఫైర్ అధికారులు అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల ఈనెల 14న ప్రారంభమైనట్లు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని వారం రోజులపాటు అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఫైర్ అధికారి నర్సింలు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన కరపత్రాలు ప్రజలకు అందజేస్తు.. గ్రామాల్లో గోడ ప్రతులు అతికిస్తున్నారు. కరపత్రాలు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది.
- Advertisement -



