- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి చెలిమల్ల మల్లిఖార్జునరెడ్డి మాతృమూర్తి చెలిమల్ల రాజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య ఆదివారం వారి స్వగ్రామైన మంథని మండలంలోని నాగేపల్లిలో మృతురాలి కుటుంబాన్ని పరమార్షించి, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల వార్డు సభ్యుడు వొన్న తిరుపతి రావు పాల్గొన్నారు.
- Advertisement -



